వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు

వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు

వృషభరాశి

ఆదాయం : 05
వ్యయం : 14
రాజపూజ్యం : 05
అవమానం : 04

కృత్తిక 2, 3, 4 పాదములు
రోహిణి 4 పాదములు
మృగశిర 1, 2 పాదముల యందు పుట్టినవారు
"ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వె. వో" అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు
వృషభరాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు:  వృషభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా
ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్ధంలో కేతువు, దశమంలో రాహువు, ఏకాదశంలో శని, ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడాను శుభస్థానంలో ఉంటారు.

 గురువు జూన్ రెండవ తేదీ వరకు 2వ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహువు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయంలోకి డిసెంబర్ 5 వ తేదీన మారుతారు. ఈ ప్రదానమైన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది.

వృత్తి పరంగా తిరుగులేని విధంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలులభిస్తాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ, మెటల్స్ (ఇనుము), ఆయిల్ వ్యాపారస్థులకు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అమ్మేవ్యాపారస్థులకు లాభాలు బాగుంటాయి.

ఆదాయం కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చిరువ్యాపారాలు, డాక్టర్స్​ కు, లాయర్స్​ కు, ఫార్మా రంగం వారికి, ట్రావెల్స్ ఏజెన్సీ వారికి, ఆటోమోబైల్స్ రంగంలోని వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ రంగంలోని వారికి ఎక్కువ శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. విదేశీ ఉద్యోగాలు, లేదా మీ చదువుకు సంబందించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. హెచ్ 1బి వీసా, గ్రీన్​ కార్డు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువు కోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

ALSO READ : మేషరాశి వారి కోరికలు నెరవేరే సమయం వచ్చేసింది.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి..!

స్త్రీల వలన ఇబ్బందులు. ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబం కోసం ఎంత శ్రమించినప్పటికీ కుటుంబంలో మీకు విలువ తక్కువగా ఉంటుంది. మీ వల్ల బంధువర్గం లాభాలు పొందగలరు. ష్యూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. 

సాధ్యమైనంత వరకు సేవింగ్స్​ కు ప్రాధాన్యత ఇవ్వండి. రాజకీయ రంగంలో పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. సంవత్సర ద్వితీయార్థం నుండి అనగా డిసెంబర్ 5 నుండి భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు ప్రభావం వలన సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు ఏర్పడుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందకు వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తుంది. సంతానం అభివృద్ధి బాగుంటుంది.  గృహయోగం, వాహనయోగం ఉంది. కళా సంబంధమైన విషయాలలో, వృత్తి ఉద్యోగాలలో విశేషమైన ఆదరణ లభిస్తుంది.

నిత్యం ఓం నమశ్శివాయవత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించాలి. విద్యార్థినీ విద్యార్థులు చదువు పై ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతనే సఫలం అవుతాయి. 

హెచ్ 1బి వీసా కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. ఏదైన సరే ఒకచోట స్థిరంగా ఉండి స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. తద్వారా అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

గ్యాస్టిక్, ఇండైజిషన్, స్కిన్, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, హెచ్.ఆర్. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటమనేది చెప్పదగినది.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అన్నివిధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగుతాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి విశేషమైన కృషి చేస్తారు.

ఏపనైన సరో ఒత్తిడి లేకుండా పూర్తవదని గ్రహించగలుగుతారు. అయితే డిసెంబర్​లో  చతుర్ధాధిపతియైన కేతువు తృతీయంలోకి మారడం వలన సంతానం ఆరోగ్యంపట్ల, చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రీర్​ కార్డు లభిస్తుంది. మీ కష్టాన్ని బయటవాళ్ళు గుర్తించిన విధంగా, ఇంట్లో వాళ్ళు గుర్తించలేరు అనే భావన కలుగుతుంది. 

ఆరోగ్యపరంగా  జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు. చేస్తున్న వారికి వివాహ ప్రాప్తి, సంతానంకోసం ప్రయత్నం చేస్తున్నవారికి సంతానప్రాప్తి కలుగు తుంది. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు.

మెకానికల్,చిరు వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్థులకు, హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి, బ్యూటిషియన్స్, ఫ్యాషన్రెజైనింగ్ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ ఉత్పత్తుల రంగం, హోమియో రంగాలలో ఉన్నవారికి, డెంటిస్ట్, ఈఎన్​టీ డాక్టర్​ వృత్తి వారికి తదితర వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం కలుసుబాటుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికివిశేషమైన ఆదరణ లభిస్తుంది. విమర్శలకు తావు లేకుండా రాజకీయ పదవి లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.. 

ప‌రిహారాలు

  • రోజూ ఓం  నమశ్శివాయ మంత్రాన్ని 11 నిమిషాల పాటు శ్రద్దగా ప‌ఠించాలి.
  • నువ్వుల నూనెతో దీపారాధ‌న చేయాలి
  • సుహ్మణ్య పాశుపత హోమం చేయడం మంచిది.
  •  విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది. 
  •  దక్షిణామూర్తి రూపును మెడలో ధరించాలి.
  • శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి..

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.